యువర్ అటెన్షన్ ప్లీజ్.. రైల్వే ప్రయాణికులకు హెచ్చరికలు!

Guidelines For Travelers : దసరా,దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 మధ్య 392 ఫెస్టివల్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు భారత రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది.

Update: 2020-10-15 04:57 GMT

Guidelines For Travelers : దసరా,దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 మధ్య 392 ఫెస్టివల్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు భారత రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది. అయితే ఒక పక్కా పండగ సీజన్ కావడం, మరోపక్కా కోవిడ్ మహమ్మారి పెరుగుతూ ఉండడంతో రైల్వే భద్రతా దళం (ఆర్‌పీఎఫ్‌) కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రైల్వే స్టేషన్ కి వచ్చినప్పటి నుంచి వెళ్ళేవరకు ప్రజలు కచ్చితంగా ఈ నిబంధలను పాటించాలని సూచించింది. లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎవరైనా వీటిని అతిక్రమిస్తే రైల్వే చట్టం ప్రకారం 1989లోని పలు సెక్షన్ల కింద జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

మార్గదర్శకాలు ఇవే!

1. మాస్క్ ధరించడం తప్పనిసరి.. మాస్క్ ధరించకుండా రైల్వే పరిసరాలకు కుడా రావొద్దు.

2. సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి.

౩. కరోనా సోకిందని తెలిసి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి రావొద్దు.. రైల్లో ప్రయాణించవద్దు.

4. కరోనా వైరస్ పరీక్ష చేసుకొని, ఫలితం కోసం ఎదురుచూసేవారు కూడా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి రావొద్దు.. రైల్లో ప్రయాణించవద్దు.

5. రైల్వే స్టేషన్ వద్ద హెల్త్ చెక్ అప్ బృందానికి కచ్చితంగా సహకరించాలి..లేనిచో చర్యలు తప్పవు!

6.బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేయకూడదు. చెత్తాచెదారం వేయకూడదు.

7. ప్రజల ఆరోగ్య దృష్ట్యా చుట్టూ పరిసర ప్రాంతాలలో అపరిశుభ్ర వాతావరణాన్ని సృష్టించవద్దు!

8. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి! 

Tags:    

Similar News