Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ ఇలా అన్నారేంటీ? ఏమైనా అర్థం అవుతోందా?

Update: 2025-05-18 02:33 GMT

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ ఇలా అన్నారేంటీ? ఏమైనా అర్థం అవుతోందా?

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటలయుద్ధం ముదిరింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ కు ముందే సమాచారం అందేలా విధంగా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారాని రాహుల్ గాంధీ విమర్శించారు. జైశంకర్ మాట్లాడిన వీడియోను రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. జైశంకర్ ఇలా మాట్లాడటం నేరమే అవుతుందన్నారు. విదేశాంగశాఖ మంత్రి స్టేట్ మెంట్ తో భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో తెలపాలన్నారు.

అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విదేశాంగశాఖ తీవ్రంగా ఖండిస్తూ...జైశంకర్ స్టేట్ మెంట్ ను రాహుల్ గాంధీ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. పాకిస్తాన్ పౌరులను భారత్ టార్గెట్ చేయలేదని..కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాయని వివరించారు. మరోవైపు గాంధీనగర్ పర్యటనలో ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 కు ముందు భారత్ పై ఉగ్రదాడులు జరిగియాన్నారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పెద్ద దాడులు జరిగాయన్నారు. కానీ యూరీ, పుల్వామా, పహల్గామ్ దాడులకు వెంటనే ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. పాకిస్తాన్ లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించామన్నారు. అందుకే ఆపరేషన్ సింధూర్ తో వాళ్ల హెడ్ క్వార్టర్స్ ను ధ్వంసం చేశామని..ఆపరేషన్ సింధూర్ ను చూసి ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్ నిపుణులు ఆశ్చర్యానికి గురయ్యారంటూ తెలిపారు.


పాకిస్తాన్ లో 9 ప్రాంతాల్లో దాడులు చేశారన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన మాట నిలెబట్టుకున్నారన్నారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తో దేశ ప్రతిష్ఠ పెరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. పాక్ తో కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారని అమెరికా ఎందుకు జోక్యం చేసుకుందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

Tags:    

Similar News