Rahul Gandhi: 22 మంది అనాథ చిన్నారులను దత్తత తీసుకోనున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు.

Update: 2025-07-29 07:18 GMT

Rahul Gandhi: 22 మంది అనాథ చిన్నారులను దత్తత తీసుకోనున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. జమ్మూకశ్మీర్‌ పూంఛ్‌ జిల్లాలో ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో సరిహద్దు ఉద్రిక్తతల్లో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులను రాహుల్‌ దత్తత తీసుకోనున్నారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ అధికారికంగా ప్రకటించారు.

ఈ చిన్నారులు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసేవరకు వారి విద్య, జీవన ఖర్చులు, ఇతర అవసరాలన్నింటిని రాహుల్ గాంధీ స్వయంగా భరించనున్నట్లు తెలిపారు. ఇది ఒక్క రాజకీయ నాయకుడిగా కాకుండా ఓ వ్యక్తిగా ఆయనకు ఉన్న హృదయాన్ని చూపిస్తోంది.

ఇటీవల భారత్–పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, జమ్మూకశ్మీర్‌ సరిహద్దు గ్రామాలను రాహుల్ గాంధీ సందర్శించారు. పూంఛ్‌ జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితిని చూసిన అనంతరం, వారి వివరాలను సేకరించేందుకు పార్టీ నాయకులను ఆదేశించారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటూ, మొత్తం 22 మంది చిన్నారుల జాబితాను సిద్ధం చేశారు.

రాహుల్ చేసిన ఈ సహాయం ఆ చిన్నారులకు కేవలం ఆర్థికంగా కాదు, మానసికంగా కూడా బలాన్ని ఇస్తుందని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది మానవతా విలువల ప్రదర్శనగా రాజకీయ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.

Tags:    

Similar News