Rahul Gandhi: సభ నుంచి బీజేపీ ఎంపీలు పారిపోయారు

Rahul Gandhi: లోక్‌సభలో ఘటన జరిగిన వెంటనే బీజేపీ ఎంపీలు సభ నుంచి పారిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2023-12-22 14:00 GMT

Rahul Gandhi: సభ నుంచి బీజేపీ ఎంపీలు పారిపోయారు

Rahul Gandhi: లోక్‌సభలో ఘటన జరిగిన వెంటనే బీజేపీ ఎంపీలు సభ నుంచి పారిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. యువకులు ఎందుకు నిరసన చేశారనేది గమనించాలన్నారు. దేశంలో నిరుద్యోగమే ఇందుకు కారణమని తెలిపారు. నిరుద్యోగం గురించి వదిలేసి.. తాను వీడియో రికార్డు చేస్తున్నారనే విషయంపై చర్చించడం దారుణమన్నారు రాహుల్ గాంధీ.

అయితే, ఈ వ్యవహారంపై చర్చించాలని, కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తూ, సభకు అడ్డుతగిలారు. దీంతో ఉభయసభల స్పీకర్లు ఏకంగా 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సభను నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నాయి.

ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా బ్లాక్‌కు చెందిన నాయకులు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ(ఎం)కి చెందిన సీతారాం ఏచూరితో సహా ప్రముఖ ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యారు.

Tags:    

Similar News