Rahul Gandhi In Sonipat: ట్రాక్టర్‌తో దుక్కి దున్ని.. వరి నాట్లు వేసిన రాహుల్‌

Rahul Gandhi In Sonipat: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉదయం హర్యానాలోని సోనిపట్‌లోని మదీనా గ్రామంలో పర్యటించారు.

Update: 2023-07-08 05:32 GMT

Rahul Gandhi In Sonipat: రైతులతో కలిసి వరినాట్లు వేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi In Sonipat: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉదయం హర్యానాలోని సోనిపట్‌లోని మదీనా గ్రామంలో పర్యటించారు. రైతులతో కలిసి రాహుల్ వరినాట్లు వేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా మార్గ మధ్యలో వరినాట్లు వేస్తున్న రైతులను చూసి ఆగిన రాహుల్ గాంధీ పొలంలోకి దిగారు. ట్రాక్టర్‌లో పొలం దున్నిన అనంతరం... రైతులతో రాహుల్ కాసేపు ముచ్చటించారు. కొద్ది రోజులుగా సామన్య ప్రజలతో మమేకమవుతున్న రాహుల్ గాంధీ... వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో బైక్ మెకానిక్ వర్క్‌షాప్‌ను సందర్శించి అక్కడి మెకానిక్‌‌లతో రాహుల్ మాట్లాడారు. అంతకు ముందు డ్రైవర్ల కష్టాలను తెలుసుకునేందుకు లారీలో ప్రయాణించారు రాహుల్.

Tags:    

Similar News