Breaking News: రాహుల్ గాంధీపై అనర్హత వేటు..

Breaking News: రాహుల్ గాంధీపై అనర్హత వేటు..

Update: 2023-03-24 08:53 GMT

Breaking News: రాహుల్ గాంధీపై అనర్హత వేటు..

Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేట పడింది. ఎంపీగా చెల్లుబాటు కాదని లోక్‌సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. సూరత్ కోర్టులో వేసిన రెండేళ్ల శిక్షతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్ సభ సెక్రటరీ జనరల్ తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ చేసిన విమర్శలు వివాదాస్పదం అయ్యాయి. దేశంలో దొంగల పేర్లన్నీ మోడీ ఇంటి పేరుతో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతలు పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు నిన్న రాహుల్‌ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఆయనకు వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు. పై కోర్టుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30 రోజుల గడువు ఇచ్చింది.

Tags:    

Similar News