Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి సెక్యూరిటీ లోపం.. హోం మంత్రికి ఖర్గే లేఖ

Rahul Gandhi: లోపాలు ఉన్నాయని హోం మంత్రికి రాసిన లేఖలో పేర్కొ్న ‌ఖర్గే

Update: 2024-01-24 05:52 GMT

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి సెక్యూరిటీ లోపం.. హోం మంత్రికి ఖర్గే లేఖ

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల వద్ద బారికేడ్లను ఏర్పాటుచేశారు. అయినప్పటికీ దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దఅయితే.. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి ఖర్గే లేఖ రాశారు. రాహుల్ యాత్రకు సంబంధించి.. భద్రత కల్పించడంలో.. అసోం పోలీసులు విఫలమయ్యారని.. ఖర్గే లేఖలో పేర్కొన్నారు.

కాగా... సోమవారం మధ్యాహ్నం తర్వాత రాహుల్‌ యాత్ర అస్సాం నుంచి నాగాలాండ్‌లోకి ప్రవేశించి.. తిరిగి మళ్లీ అసోంలోని.. ఇరు రాష్ట్రాల సరిహద్దుకు చేరుకున్న రాహుల్‌.. స్థానిక యువతతో సంభాషించారు. అక్కడి నుంచి గువాహటి నగరానికి బయల్దేరారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని అంతకుముందు అస్సాం ప్రభుత్వం ఆదేశించింది. ట్రాఫిక్‌ కారణాల దృష్ట్యా గువాహటిలో యాత్రకు అనుమతించడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. నగర బైపాస్‌ మీదుగా వెళ్లాలని సూచించారు. దీంతో రాహుల్ కారు దిగకుండానే... కారు పై నుంచే.. అభవాదం చేస్తూ... పాదయాత్రను కొనసాగించారు.

Tags:    

Similar News