Bharat Jodo Yatra: కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
Bharat Jodo Yatra: రేపు తెలంగాణలోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra: కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
Bharat Jodo Yatra: విద్వేషాలు వీడి దేశమంతా ఐక్యంగా ఉండాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. 43వ రోజు రాయచూర్‌లోని యరగేరా గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఇక భారత్ జోడో యాత్రలో కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్‌ను కలిసేందుకు సెక్యూరిటి వలయం దాటుకొని మరీ దూసుకు వస్తున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇక భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు జోడో యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 23 నుంచి 30 వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాత్ర సాగనుండగా దీపావళి సందర్భంగా 24, 25, 26న మూడు రోజుల పాటు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. 110 కిలోమీటర్లు సాగే పాదయాత్రలో తెలంగాణ సహా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాహుల్ తెలుసుకోనున్నారు.