క‌ర్ణాట‌కలో కొన‌సాగుతున్న రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌

Bharat Jodo Yatra: యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

Update: 2022-10-06 04:30 GMT

క‌ర్ణాట‌కలో కొన‌సాగుతున్న రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌

Bharat Jodo Yatra: దసరా సందర్భంగా రెండు రోజుల విరామం అనంతరం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో కొనసాగుతోంది. మాండ్య జిల్లా బెల్లాలేలో యాత్ర సందర్భంగా వివిధ వర్గాల ప్రజల్ని రాహుల్ కలుస్తున్నారు. ఈ యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. యాత్రలో పాల్గొనడానికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారి సమస్యలను సావధానంగా వింటున్నారు. యాత్రలో ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ... వారికి అభివాదం చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటున్నారు.

నేడు భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలు పాల్గోనున్నారు. కర్ణాటకలో మండ్య జిల్లాలో సోనియాగాంధీ రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. సోనియాగాంధీ సోమవారమే కర్ణాటక రాష్ట్రంకు చేరుకున్నారు. రెండు రోజులు కొడుగు జిల్లాలోని ఓ రిసార్ట్‌లో బసచేశారు. కాగా.. గురువారం ఆమె రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారు. వచ్చే సంవత్సరం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు పాదయాత్ర కీలకంగా మారింది.

బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, కేంద్రం ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర గురువారం తిరిగి కర్ణాటకలో ప్రారంభమైంది. విజయదశమి సందర్భంగా మంగళ, బుధవారాల్లో పాదయాత్రకు రాహుల్ విరామం ఇచ్చారు. గురువారం ఉదయం 6.30 గంటలకు తిరిగి పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఉదయం 11గంటల వరకు నాగమంగళ తాలూకా చౌడేనహల్లి గేట్ వద్దకు యాత్ర చేరుతుంది. సాయంత్రం 4:30 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభమై 7గంటలకు బ్రహ్మదేవరహల్లి గ్రామం వద్ద సభలో రాహుల్ ప్రసంగిస్తారు. రాత్రి నాగమంగళ తాలూకా ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి ఎదురుగా మడకే హోసూర్ గేట్ వద్ద రాహుల్, ఆయన బృందం బస చేస్తారు.

Tags:    

Similar News