ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను కలుస్తున్న మాజీ సీఎం అమరీందర్ సింగ్

* నిన్న కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలిసిన అమరీందర్ సింగ్ * ఇవాళ ప్రధాని మోడీని అమరీందర్ సింగ్ కలిసే అవకాశం

Update: 2021-09-30 05:43 GMT

కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలిసిన అమరీందర్ సింగ్ (ట్విట్టర్ ఫోటో)

Amarinder Singh: పంజాబ్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఢిల్లీకి వచ్చిన ఆయన వరుసపెట్టి బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్నారు. నిన్న సాయంత్రం హోం మంత్రి అమిత్ షాను కలిసిన అమరీందర్ సింగ్‌ ఇవాళ ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తన ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదని అమరీందర్ సింగ్ మొన్న ప్రకటించారు. కానీ ఆయన మాత్రం షాతో భేటీ కావడం చర్చకు దారితీసింది. అమిత్ షా అధికార నివాసానికి వెళ్లిన కెప్టెన్ వివిధ అంశాలపై డిస్కష్ చేశారు. అయితే అమరీందర్ బీజేపీలో చేరతారా.. లేదంటే మద్దతు తెలుపుతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ఇంకా దారులు మూసుకుపోలేదని అమరీందర్ సింగ్ సన్నిహితులు అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ అమరీందర్‌ ప్రధాని మోడీని కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ పరిశీలకులు హరీశ్ చౌదరీ చండీఘడ్ చేరుకున్నారు. పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సిద్దూ పీసీసీ చీఫ్ పదవీకి రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో అమరీందర్/ సిద్దూను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ హై కమాండ్ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ మంగళవారం మంత్రివర్గం కొలువుదీరింది. రాణా మంత్రి పదవీ చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సిద్దుకు స్థిరత్వం లేదని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. అతనికి అంతలా ప్రాధాన్యం ఇవ్వడంతో ఇలా చేస్తున్నారని కామెంట్ చేశారు. మొత్తానికి పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలు చకచక మారిపోతున్నాయి.

Tags:    

Similar News