Navjot Sidhu: పంజాబ్ కాంగ్రెస్‌లోని వర్గ పోరుకు తెర
Navjot Sidhu: ఒకేతాటిపైకి పార్టీలోని కీలక నేతలు * ఒకే వేదికపై కనిపించనున్న అమరిందర్ సింగ్, సిద్ధూ
అమరిందర్ సింగ్ మరియు నవజోత్ సిద్దు (ఫైల్ ఇమేజ్)
Navjot Sidhu: పంజాబ్ కాంగ్రెస్‌లో కొన్నాళ్లుగా సాగుతున్న వర్గ పోరుకు తెర పడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలోని కీలక నేతలు ఒకేతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న సీఎం అమరిందర్ సింగ్, నూతన పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నారు.
ఇవాళ జరగబోయే సిద్ధూ పీసీసీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ హాజరుకానున్నారు. పార్టీ నేతలతో కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్‌కు అమరిందర్ వెళ్లనున్నారు. సిద్దూతోపాటు రాష్ట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇటీవల నియమితులైన కుల్జీత్ సింగ్ నగ్రా, సంగత్ సింగ్ గిల్జియన్ గురువారం మొహాలీలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లి అమరీందర్‌ను ఆహ్వానించారు. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేల తరఫున తమ ఆహ్వానానికి సీఎం అంగీకరించారని చెప్పారు. సిద్ధూ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరవు తారని వెల్లడించారు.