పీఎస్‌ఎల్‌వీ-సి51 ప్రయోగం విజయవంతం

Update: 2021-02-28 05:28 GMT

పీఎస్‌ఎల్‌వీ-సి51 ప్రయోగం విజయవంతం

పీఎస్‌ఎల్వీ సీ 51 ఉపగ్రహ వాహకనౌక (రాకెట్)ను ఆదివారం ఉదయం 10.24కు నింగిలోకి విజయవంతంగా పంపించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ51ని ప్రయోగించారు. శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభంకాగా, ఆదివారం ఉదయం 10.24కు కౌంట్‌డౌన్‌ జీరోకు చేరుకోగానే నింగిలోకి దూసుకు వెళ్లింది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ప్రకటించారు. 

Tags:    

Similar News