Priyanka Gandhi: ఆ సదస్సుకు ప్రధాని హాజరు కావొద్దు
Priyanka Gandhi: ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరిగే డీజీపీలు, ఐజీల సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కావొద్దని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సూచించారు.
Priyanka Gandhi: ఆ సదస్సుకు ప్రధాని హాజరు కావొద్దు
Priyanka Gandhi: ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో జరిగే డీజీపీలు, ఐజీల సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కావొద్దని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సూచించారు. ఇదే విషయమై తాను ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు చెప్పారు. రైతుల విషయంలో ప్రధాని నిజంగా ఆందోళన చెందుతున్నట్లయితే లఖింపూర్ ఖేరీలో రైతులను కారుతో తొక్కించిన నిందితుడి తండ్రి అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతో వేదికను పంచుకోవద్దని అన్నారు.
లఖింపూర్ ఖేరీలో మరణించిన రైతుల కుటుంబాలు న్యాయం జరగాలని కోరుకుంటున్నాయని చెప్పారు. నిందితుడి తండ్రి అజయ్ మిశ్రా ఇంకా కేంద్ర మంత్రిగా కొనసాగుతుంటే న్యాయం ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోడీకి రైతుల పట్ల ఏ మాత్రం కనికరం ఉన్నా ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. మృతుల కుటుంబీకులకు నష్ట పరిహారం చెల్లించాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.