Priyanka Gandhi: ప్రియాంకగాంధీపై పూల వర్షం కురిపించిన కాంగ్రెస్ శ్రేణులు
Priyanka Gandhi: పూల వర్షంతో ప్రియాంక గాంధీకి ఘనస్వాగతం
Priyanka Gandhi: ప్రియాంకగాంధీపై పూల వర్షం కురిపించిన కాంగ్రెస్ శ్రేణులు
Priyanka Gandhi: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ గులాబీ పూల మయం అయింది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల కోసం వచ్చిన ప్రియాంక గాంధీకి ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం బయటకు వచ్చిన ప్రియాంక.. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ర్యాలీగా కాన్వాయ్‌పై బయలుదేరారు. ఈ సందర్బంగా ప్రియాంకపై గులాబీ పూల వర్షం కురిపించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, PCC చీఫ్ మోహన్ మార్కం, ఇతర కాంగ్రెస్ నేతలు విమానాశ్రయంలో ప్రియాంకకు వెల్‌కమ్ చెప్పారు. బుట్టల కొద్దీ పూలను ప్రియాంకపై చల్లుతూ స్వాగతం పలకడమే కాక, రాహదారి పొడవునా పూలను పేర్చి ప్రియాంకకు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.