Robert Vadra: ప్రత్యక్ష రాజకీయాలపై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తి
Robert Vadra: 2019 వరకు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ
Robert Vadra: ప్రత్యక్ష రాజకీయాలపై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తి
Robert Vadra: గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న యూపీలోని అమేథీ నుంచి అదే కుటుంబానికి చెందిన రాబర్ట్ వాద్రాను కాంగ్రెస్ బరిలోకి దింపనుందా..? ఇంతకీ అమేథీ నుంచి పోటీకి రాబర్ట్ వాద్రా సిద్ధమేనా? అంటే అవుననే తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ అవకాశమిస్తే తప్పకుండా పోటీ చేస్తానని రాబర్ట్ చెప్పుకొచ్చారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఉన్న తనను ఎంపీగా పోటీ చేయాలని అమేథీ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తాను మార్పు తీసుకురాగలనని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే.. అమేథీ నుంచి కాని.. మొరాదాబాద్, హర్యానా నుంచి కానీ పోటీ చేసేందుకు సిద్ధమన్నారు రాబర్ట్.