Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం
Priyanka Gandhi: రాహుల్ గాంధీ కృషిని కొనియాడుతూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్
Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం
Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని కొనియాడుతూ ఆమె ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. బీజేపీ నిన్ను ఎంతగానో అమవానించినా, అవహేళన చేసినా.. ఏం చేసినా సరే దృఢంగా నిలబడ్డావని ప్రశంసించారు. అవరోధాలు ఎదురైనప్పుడు కూడా వెనక్కి తగ్గలేదన్నారు. నీ నమ్మకాన్ని ఎంతగా అవమానించినా విశ్వాసాన్ని కోల్పోలేదు. నీపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా సత్యం కోసం నీ పోరాటాన్ని ఆపలేదని రాహుల్‌ను కొనియాడారు ప్రియాంక. ప్రతి రోజూ నీపై కోపం, ద్వేషం పంచినా దాన్ని నీ దరి చేరనీలేదు. ప్రేమ, దయతో నిజం కోసం పోరాడావన్నారు. నువ్వు మాలో అందరికంటే ధైర్యవంతుడివని మాకు తెలుసు. నీకు సోదరిగా ఉన్నందుకు గర్వపడుతున్నా అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ.