Narendra Modi: ప్రధాని మోదీ ఫోన్‌ చేసింది వీరికే..

దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌, ఆ మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులపై మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, వివిధ పార్టీల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి సహా దేశంలోని వివిధ పార్టీల అధినేతలకు, దేశంలో ఉండే సీనియర్ నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.

Update: 2020-04-06 04:10 GMT
PM Modi

దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌, ఆ మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులపై మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, వివిధ పార్టీల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి సహా దేశంలోని వివిధ పార్టీల అధినేతలకు, దేశంలో ఉండే సీనియర్ నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.

మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్, హెచ్‌డీ దేవెగౌడలతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. ఇంకా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, ఒరిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సమాజ్‌వాదీ పార్టీ అగ్ర నేతలు అఖిలేశ్‌ యాదవ్,

ములాయం సింగ్‌ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, శిరోమణి అకాలీదళ్‌ నేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌తో ప్రధాని చర్చించారు. ఈ సందర్బంగా కరోనా కట్టడికోసం సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా వారిని కోరారు ప్రధాని. ఇదిలావుంటే కోవిడ్ -19 సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో బుధవారం (8వ తేదీ) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు జరుగుతుందని.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News