Narendra Modi: రేపు జమ్ముకశ్మీర్‌లో ప్రధాని మోడీ పర్యటన
* సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సెలబ్రేషన్స్ * ప్రతిఏటా సైనికులతోనే మోడీ దీపావళి వేడుకలు
నరేంద్ర మోడీ (ట్విట్టర్ ఫోటో)
Narendra Modi: ప్రధాని మోడీ రేపు కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ప్రధాని ప్రతి ఏటా సైనికులతో దీపావళి పండుగను సైనికులతో సెలబ్రేట్ చేసుకుంటున్న మోడీ ఈసారి జమ్ముకశ్మీర్‌లోని బలగాల మధ్య దీపావళి సంబరాలు జరుపుకోనున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు కశ్మీర్‌లో ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు భద్రతాబలగాలు భారీ ఆపరేషన్ చేసిన నేపధ్యంలో ప్రధాని పర్యటన హాట్ టాపిక్ అవుతోంది.