PM Modi: గుజారాత్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ గెలుపు ఖాయం

PM Modi: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ

Update: 2022-11-20 09:57 GMT

PM Modi: గుజారాత్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ గెలుపు ఖాయం

PM Modi: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో పార్టీ తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వెరావల్, ధోరార్జీ, అమ్రేలి, బొటాడ్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజ్‌కోట్‌లోని ధోరాజీ వద్ద మూడు దశాబ్దాలుగా నర్మదా డ్యామ్ ప్రాజెక్టును నిలిపివేసిన నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త మేధా పాట్కర్‌తో కలిసి రాహుల్ గాంధీ తన పాదయాత్ర చేయడాన్ని తప్పుబట్టారు. సోమనాథుని ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో రికార్డులు బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News