Vaibhav Suryavanshi: శభాష్ వైభవ్.. బీహార్ బిడ్డను ప్రశంసించిన ప్రధాని మోదీ
Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో అతిపిన్నవయస్సులో ఫాసెస్ట్ సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఐపీఎల్ లో బీహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనను నేను చూశాను. చిన్న వయసులో గొప్ప రికార్డును నెలకొల్పాడు. వైభవ్ ప్రదర్శన వెనక ఎంతో శ్రమ ఉందని మోదీ అన్నారు. బీహార్ లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడారు. వైభవ్ ను కొనియాడారు ప్రధాని మోదీ. క్రీడాకారులు ఎంత ఎక్కువగా రాణిస్తే అంత బాగా మెరుగుపడతారని ప్రధాని అన్నారు. 14ఏళ్ల వైభవ్ గుజరాత్ పై 35 బంతుల్లో సెంచరీ చేసి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని జాగ్రత్తగా కాపాడాలంటూ బీసీసీఐకి, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మీడియా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ సూచించాడు. అతన్ని సూచిన్ టెండూల్కర్ వలే తయారు చేయాలని వినోద్ కాంబ్లి, ప్రుథ్వీ షా మాదిరిగా కానీయొద్దని ఛాపెల్ అన్నారు. సచిన్ కుర్రాడిగా ఉన్నప్పుడు కేవలం ప్రతిభతోనే విజయవంతం అవ్వలేదు. బలమైన మద్దతు వ్యవస్థ, క్రమశిక్షణ, తెలివైన కోచ్, మంచి కుటుంబం సచిన్ ను గందరగోళం నుంచి కాపాడాయి. అదే సమయంలో అంతే ప్రతిభావంతుడు, బహుశా ఇంకాస్త మెరుగైన బ్యాటర్ కాంబ్లీ పేరు, క్రమశిక్షణను సమతుల్యం చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు. అతని ఎదుగుదల మాదిరే పతనం కూడా నాటకీయంగానే సాగింది. మరో అద్బుత ప్రతిభావంతుడు ప్రుథ్వీషా గాడితప్పాడు. వైభవ్ ను బీసీసీఐ, ఫ్రాంచైజీలు, మెంటార్లు మీడియా జాగ్రత్తగా కాపాడాలన్నారు.