Sindoor Sapling: సిందూరం మొక్క‌ నాటిన ప్ర‌ధాని మోదీ

Update: 2025-06-05 09:05 GMT

Sindoor Sapling: సిందూరం మొక్క‌ నాటిన ప్ర‌ధాని మోదీ

Sindoor Sapling: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో సింధూర మొక్కను నాటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ లోని కుచ్ కు చెందిన మహిళలు ఈ మొక్కను తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం సమయంలో ఆ మహిళలు అసాధారణ సాహసాన్ని, దేశభక్తిని చాటినట్లు ప్రధాని మోదీ తెలిపారు. సోషల్ మీడియా ఖాతాలో మోదీ, సింధూరం మొక్క నాటిన వీడియోను, ఫొటోలను పోస్ట్ చేశారు. దేశ మహిళల ధైర్యానికి, ప్రేరణకు గుర్తుగా సింధూరం మొక్క నిలుస్తుందన్నారు. ఢిల్లీలోని 7లోక్ కల్యాణ్ మార్క్ లో ఉన్న నివాసంలో మోదీ ఆ మొక్కను నాటారు.

పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన మిలిటరీ చర్యకు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. భారతీయ మహిళలు సంప్రదాయ రీతిలో తమ నుదుటికి సింధూరం పెట్టుకుంటారు. ఇది తమ సౌభాగ్యంగా భావిస్తుంటారు. భారతీయ సంప్రదాయంలో సింధూరానికి మతపరమైన, ఆచారపరమైన విశిష్టత ఎంతో ఉంది. తన వీడియో సందేశంలో గ్లోబల్ క్లైమేట్ గురించి మోదీ ప్రస్తావించారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు అన్ని దేశాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడమే ఈ యేటి పర్యావరణ నినాదమని తెలిపారు. గత నాలుగైదు ఏళ్ల నుంచి భారత్ దీనిపై పనిచేస్తున్నట్లు చెప్పారు. 

Tags:    

Similar News