ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెంపు

* రూ.6వేల ఆర్థిక సాయాన్ని రూ.10వేలకు పెంపు * వచ్చే బడ్జెట్‌లో ప్రకటించనున్న కేంద్రం

Update: 2021-01-26 04:25 GMT

Representational Image

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సాయాన్ని పెంచనుంది. ప్రస్తుతం ఇస్తున్న 6వేల ఆర్థిక సాయంతో ప్రయోజనం చూకూరడం లేదని కేంద్రం భావిస్తుంది. 6 వేల సాయాన్ని 10 వేలకు పెంచేందుకు సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ వి‍షయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పీఎం-కిసాన్‌ సాయాన్ని రూ.10 వేలకు పెంచడం ద్వారా రైతుల ఆగ్రహాన్ని కొంత చల్లార్చవచ్చనే అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కరోనా నేర్పిన పాఠంతో ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ దృక్పథంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. 

Tags:    

Similar News