Viral Video: గుడిలో..మందుకొట్టి చిందులేసిన పూజారులు, వీడియో వైరల్
Viral Video: తమిళనాడులో అదొక ప్రముఖ ఆలయం. అయితే 28ఏళ్ల తర్వాత ఇప్పుడు అక్కడ మహా కుంభాభిషేకం జరగనుంది.
Viral Video: గుడిలో..మందుకొట్టి చిందులేసిన పూజారులు, వీడియో వైరల్
Viral Video: తమిళనాడులో అదొక ప్రముఖ ఆలయం. అయితే 28ఏళ్ల తర్వాత ఇప్పుడు అక్కడ మహా కుంభాభిషేకం జరగనుంది. అయితే దీనికోసం వచ్చిన పూజారులు, తోటి పూజారులతో కలిసి గుడిలో పార్టీ చేసుకున్నారు. మందుకొట్టి, చిందులేసారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న పెరిగియా మారియమ్మన్ ఆలయం చాలా ఫేమస్. అయితే దాదాపు 28ఏళ్ల తర్వాత ఈ ఆలయంలో వచ్చే నెలలో కుంభాభిషేకం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ ఉప పూజారి కోమతి వినాయగం కుంభాభిషేక పనులు నిమిత్తం వచ్చిన ఇతర అర్చకులతో తమ ఇంట్లో కలిసి మధ్యం సేవించి, డ్యాన్సులు వేసారు. కొంతమంది మహిళా భక్తులతో కూడా వీరు అసభ్యంగా ప్రవర్తించనట్లు తెలుస్తోంది. దీనికి సంబధించిన వీడియో ఒక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే వీళ్లంతా గుడిలోకి వచ్చిన భక్తులతో అసభ్యంగా ప్రవర్తించారని దుమారం రేగుతోంది. ఆలయ ప్రాంగణంలో మధ్యం సేవించడం, మహిళా భక్తులపై అసభ్యంగా ప్రవర్తించాడనే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వీడియో ఎలా పోస్ట్ అయిందనే కోణంలో పోలీసులు ఆరాతీస్తే మాజీ అర్చకుడు కొడుకు ఈ పని చేసినట్లు తెలసింది. ఇది తెలిసిన వెంటనే ఆలయ పూజారి వినాయగం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను చేపట్టారు.
మరోవైపు ఆలయ ధర్మకర్త సర్కరయ్యమ్మాళ్ స్పందించి, కోమతి వినాయగంతో పాటు మరో నలుగురు అర్చకులను తొలగించామని, వారికి ఇక ఆలయ పూజా కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధించామని అన్నారు. ఈ గుడిలో ఎవరిపై ఎటువంటి అనుమానాలు, కేసులు ఉన్నా..వారిపై ఇక కుంభాభిషేక కార్యక్రమం తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే కొంతమంది భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా పూజారులు వ్యవహరించారని మండిపడుతున్నారు.