సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

* రాష్ట్రపతి నియమాకాన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ * తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మహిళలు

Update: 2021-08-26 14:00 GMT

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఫోటో)

Supreme Court Judges: సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల నియమాకం పూర్తయింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 9మంది జడ్జిల నియామకం ఖరారైంది. కొత్త జడ్జిల నియామక ఉత్తర్వులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. రాష్ట్రపతి నియామకాన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 9మంది జడ్జిలుగా నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. తొమ్మిది మందికి సంబంధించి విడివిడిగా నోటిఫికేషన్‌లను జారీ చేశారు. కొత్త జడ్జిలుగా జస్టిస్ హిమ కోహ్లీ, బీవీ నాగరత్న, జస్టిస్ బేల త్రివేది, జస్టిస్ జెకె. మహేశ్వరి, జస్టిస్ సి.టి రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ నాగార్జున ఉన్నారు.

దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫారసులను నిన్నరాత్రి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాష్ట్రపతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్తగా నియామకం అయిన వారిలో ముగ్గురు మహిళ న్యాయమూర్తులున్నారు.. వారిలో సీనియర్ న్యాయమూర్తి బీవీ నాగరత్న కూడా ఉన్నారు. ఈమె 2027 సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్య అవకాశాలున్నాయి. దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్ బీవీ నాగరత్న చరిత్రలో నిలిచిపోనున్నారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమ కోహ్లి సుప్రీంకోర్టుకు వెళ్తే మరొకరు రానున్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 18న తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. కొలీజియం సిఫారసు చేయడం, వారిని కేంద్రం ఆమోదించడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. 

Tags:    

Similar News