వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రాజముద్ర.. నిరసనలు తీవ్రం..

గత వారం పార్లమెంటులో రైతులకు సంబంధించిన 3 బిల్లులు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించి రాజముద్రవేశారు..

Update: 2020-09-28 04:40 GMT

గత వారం పార్లమెంటులో రైతులకు సంబంధించిన 3 బిల్లులు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించి రాజముద్రవేశారు. కాగా లోక్ సభలో ఈ బిల్లులకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ సజావుగానే జరిగినా రాజ్యసభలో మాత్రం రచ్చ రేగింది. వీటికి వ్యతిరేకంగా రాజ్యసభలో రభస సృష్టించిన 8 మంది ప్రతిపక్ష ఎంపీలను చైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. దాంతో ప్రతిపక్షాలు పార్లమెంటులో తీవ్ర ఆందోళన చేపట్టాయి. సస్పెన్షన్ అంశాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా బిల్లులను తిప్పి పంపాలని డిమాండ్ చేశారు. కానీ, రాష్ట్రపతి ఆదివారం బిల్లులను ఆమోదించారు.

బిల్లులను నిరసిస్తూ శిరోమణి అకాలీదళ్ నాయకురాలు, మోడీ మంత్రివర్గంలో ఆహార భద్రతా శాకా మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. అంతేకాదు శనివారం, అకాలీదళ్ పార్టీ కూడా ఎన్డీఏ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇదిలావుంటే నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు సంఘాలు నిరసన కోనసాగిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో నిరసనకారులు ఈ రోజు ట్రాక్టర్ ను తగలబెట్టారు. పంజాబ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనగా ఈ పని చేశారు. 

Tags:    

Similar News