Delhi: ఎర్రకోటలో వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధం

* 5 వేల మంది పోలీసులతో అదనపు భద్రత * బెలూన్లు, డ్రోన్లు ఎగరేయడాన్ని నిషేధించిన పోలీసులు * 350 కెమెరాలతో నిరంతర నిఘా

Update: 2021-08-14 16:30 GMT

ఎర్రకోట (ఫైల్ ఫోటో)

Delhi: వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల పతాకం ఎగరేసేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. వేలాది మంది భద్రతా సిబ్బంది పలు వ్యూహాత్మక ప్రాంతాలతో సహా, ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించారు. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసే ప్రసంగం కోసం బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కీలక ప్రాంతాలన్నీ భద్రతా బలగాల అధీనంలోకి వెళ్లిపోయాయి. దాదాపు 350 కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతోంది. ఒక్క ఎర్రకోట దగ్గరే 5 వేలమంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

రైతు సంఘాల ఆందోళనల నేపధ్యంలో రేపు బెలూన్లు, డ్రోన్ల ఎగరేయడాన్ని నిషేధించారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల దగ్గర మఫ్టీ పోలీసులు మోహరించారు. సరిహద్దుల్లో వాహనాలన్నింటినీ చెక్ చేశాకే వదులుతున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీలో పలు కీలక మార్గాలను రేపు ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకూ మూసేస్తున్నారు. రేపటి పంద్రాగస్టు వేడుకలలో ప్రధాని ఆహ్వానం మేరకు ఒలింపిక్ క్రీడాకారులు కూడా హాజరవుతున్నారు.

Tags:    

Similar News