Prashant Kishor: ఓ పార్టీవాడయ్యాడు

Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ రూట్ కన్ఫామ్ అయిపోయింది.

Update: 2022-04-16 15:30 GMT

Prashant Kishor: ఓ పార్టీవాడయ్యాడు

Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ రూట్ కన్ఫామ్ అయిపోయింది. రెండేళ్ల క్రితం నుంచే ఆయన కాంగ్రెస్ లో చేరే విషయంపై మంతనాలు జరుపుతున్నా తాజాగా కాంగ్రెస్ హైకమాండ్, ఇతర టాప్ లీడర్స్ తో పీకే భేటీ అయ్యారు. ఢిల్లీలోని సోనియా ఇంట్లో కాంగ్రెస్ టాప్ లీడర్స్, ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. దీంతో పీకే పార్టీలో చేరడం ఇక లాంఛనంగా మారింది. తాజా భేటీలో 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహాలపై పీకే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో 370 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని సూచించారు. మిగతా సీట్లలో భావసారూప్యత గల పార్టీలను కలుపుకొని పోయి, ఆ సీట్లను వారికి కేటాయించాలన్నారు. గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి. 2023లో మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇక పార్టీలో పీకేకు కీలకమైన బాధ్యతలు అప్పగించే విషయంలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పీకేకు అప్పగించే బాధ్యతల నిర్ణయాన్ని మాత్రం సోనియాకే వదిలేశారు. మరో వారం రోజుల్లో పూర్తి విషయాలు అధికారికంగా వెల్లడవుతాయని రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ చెప్పారు. 

Tags:    

Similar News