Prashant Bhushan : ఒక్క రూపాయి ఫైన్ క‌ట్టేశా: ప్రశాంత్ భూష‌ణ్‌

Prashant Bhushan : ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూష‌ణ్ కి సుప్రీంకోర్టు ఒక్క రూపాయి ఫైన్ విధించిన సంగతి తెలిసిందే.. సెప్టెంబరు 15లోగా జరిమానా

Update: 2020-08-31 11:44 GMT

Prashant Bhushan

Prashant Bhushan : ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూష‌ణ్ కి సుప్రీంకోర్టు ఒక్క రూపాయి ఫైన్ విధించిన సంగతి తెలిసిందే.. సెప్టెంబరు 15లోగా జరిమానా చెల్లించాలని లేనిచో మూడు నెలల జైలు శిక్ష సహా మూడు నెలల పాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్ చేస్తామని స్పష్టం చేసింది. అయితే ఆ ఫైన్ ని అయన కట్టేశారు. జ‌రిమానా శిక్షను ఖ‌రారు చేయ‌గానే.. ఆ జ‌రిమానాను చెల్లించిన‌ట్లుగా అయన వెల్లడించారు. ఒక్క రూపాయి నాణెంతో ఉన్న ఫోటోని అయన ట్విట్టర్ లో షేర్ చేశారు.


ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన రెండు ట్వీట్లు చాలా వివాదాస్పదం అయింది. దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, గత ఆరేళ్లలో సుప్రీం కోర్టు పోషించిన పాత్ర, నలుగురు ప్రధాన న్యాయమూర్తులే ఇందుకు బాధ్యులని భూషణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్లను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. ఆగస్టు 14న ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చింది.

ఈ క్రమంలో క్షమాపణ చెప్పాలని కోరింది. అయినప్పటికీ అయన క్షమాపణలు చెప్పేందుకు అంగీకరించకపోవడంతో ఈ నేప‌థ్యంలో ఇవాళ సుప్రీం ఆయ‌న‌పై ఒక రూపాయి జ‌రిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అరుణ్ మిశ్రా, బీఆర్ గార్గ్‌, కృష్ణ మురారిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. గతంలో అయన ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News