కేంద్ర రాజకీయాల్లో కెప్టెన్ అమరీందర్ కామెంట్స్ రగడ
* సిద్ధూను దేశ వ్యతిరేకి అన్న అమరీందర్ సింగ్ * కెప్టెన్ కామెంట్స్‌పై కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదన్న జవదేకర్
జవదేకర్ - అమరీందర్ (ఫైల్ ఫోటో)
Prakash Javadekar: సిద్ధూపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ చేసిన కామెంట్స్ కేంద్ర పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్ అయ్యాయి. అమరీందర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ను కార్నర్ చేస్తోంది అధికార బీజేపీ. తాజాగా ప్రకాశ్ జవదేకర్ కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూను దేశ వ్యతిరేకి అని ఆరోపించారని, దీనిపై కాంగ్రెస్ ఎందుకు స్పంధించడంలేదని ప్రశ్నించారు. సోనియా, రాహుల్, ప్రియాంక స్పందించాలని డిమాండ్ చేసిన జవదేకర్.. అమరీందర్ ఆరోపణలను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుందా? చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు.