చిలీలో హింసాత్మకంగా మారిన ర్యాలీ

*పోలీసుల కాల్పుల్లో మరణించిన నిరసనకారుడు.. *ఫ్రాన్సిస్కో మార్టినెజ్‌కు సంఘీభావంగా ర్యాలీ *పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

Update: 2021-02-07 14:19 GMT

చిలీలో పోలీసుల కాల్పుల్లో మరణించిన నిరసనకారుడు ఫ్రాన్సిస్కో మార్టినెజ్‌కు సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. శాంటియాగోలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాగ్లింగ్‌ బ్యాట్‌లను పట్టుకుని ముందుకుసాగారు. అయితే.. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. ఇక హింసకు దిగిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News