TOP 6 News @ 6PM:నానమ్మ కోసం సూర్యాపేటలో పరువు హత్య, మరో 5 ముఖ్యాంశాలు
మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తుల్లో 20 మంది తొక్కిసలాటలో మరణించారు
మహా కుంభమేళాలో తొక్కిసలాటలో తొక్కిసలాట 20 మంది మృతి
మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తుల్లో 20 మంది తొక్కిసలాటలో మరణించారు. వందకు పైగా మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున పుణ్యస్నానాలకు వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఇనుప చెత్త బుట్టల వల్ల తొక్కిసలాట జరిగిందని కొందరు చెబుతున్నారు. స్నానాలకు భక్తులు పోటెత్తడంతో తోపులాట తొక్కిసలాటకు దారితీసిందనే వాదన కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ బుధవారం ఈసీ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు, తెలంగాణలో మూడేసి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి.ఫిబ్రవరి3, 2025 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి , 2025న ఓట్లను లెక్కిస్తారు.నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 10 వరకు చివరి తేది. ఫిబ్రవరి 11న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీకి కూడా ఎన్నికలు జరుగుతాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా పోలింగ్ నిర్వహిస్తారు.ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేయనున్నారు.
రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసుల నోటీసులు
రామ్ గోపాల్ వర్మకు ఒంగోల్ రూరల్ పోలీసులు బుధవారం నోటీసులు పంపారు. ఫిబ్రవరిలో విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు. రామ్ గోపాల్ వర్మ కు వాట్సాప్ లో ఒంగోల్ రూరల్ సీఐ నోటీసు పంపారు. 2024 నవంబర్ లో ప్రకాశం జిల్లా మద్దిపాడులో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామ్ గోపాల్ వర్మను పోలీసులు ప్రశ్నించనున్నారు.
సూర్యాపేటలో పరువు హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
సూర్యాపేటలో పరువు హత్య కేసులో ఆరుగురిని సూర్యాపేట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వడ్డకొండ కృష్ణ, భార్గవి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి భార్గవి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీంతో ప్లాన్ ప్రకారంగా కృష్ణను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. కృష్ణను హత్య చేసి డెడ్ బాడీని సోమవారం తెల్లవారుజామున పిల్లలమర్రి సమీపంలోనివ కాల్వకట్టపై వదిలివెళ్లారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలోనే నిందితుడిని హత్య చేసి డెడ్ బాడీని కారులో తిప్పారు. వేరే కులానికి చెందిన కృష్ణను వివాహం చేసుకోవడం భార్గవి నానమ్మకు నచ్చలేదు. దీంతో కృష్ణను హత్య చేయాలని భార్గవి తండ్రి, మనమళ్లపై ఆమె ఒత్తిడి తెచ్చిందని పోలీసులు తెలిపారు.
సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం 9 మంది మృతి
సౌదీ అరేబియా జిజాన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు మరణించారు.భారత్ లోని అధికారులు, బాధిత కుటుంబాలతో నిరంతరం టచ్ లో ఉన్నామని సౌదీలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. 8002440003, 0122614093, 0126614276, 05561220 వాట్సాప్ నకు మేసేజ్ చేయవచ్చని భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాపై విచారణకు ఏపీ సర్కార్ ఆదేశం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చిత్తూరు కలెక్టర్ సుమిత్ నేతృత్వం వహిస్తారు. పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఇదే విషమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని మంగళంపేట సమీపంలోని అడవుల్లో భూకబ్జా చేశారని పెద్దిరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఇదెలా ఉంటే తనపై భూకబ్జా ఆరోపణలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోసిపుచ్చారు. తాను అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.