Ram Gopal Varma: ఆర్జీవీకి బిగ్ షాక్.. చెక్ బౌన్స్ కేసులో 3 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు..!

Director Ram Gopal Varm Skips AP CID Inquiry
x

RGV: విచారణకు రామ్ గోపాల్ వర్మ డుమ్మా

Highlights

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ.. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది.

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ.. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది. గత ఏడేళ్లుగా చెక్ బౌన్స్ కేసు విచారణ జరుగుతుండగా.. వర్మ కోర్టుకు హాజరుకావడంలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను దోషిగా నిర్ధారించింది. రాబోయే మూడు నెలల్లో ఫిర్యాదు దారుడికి వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని లేదంటే మరో 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పును వెల్లడించింది. 2018లో మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే శివ, సత్య, రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి చిత్రాలతో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేశారు వర్మ. దాంతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. కానీ ఆ తరువాత మాత్రం అలాంటి సినిమాలను తీయలేకపోతున్నారు. ఈ విషయాన్ని వర్మనే స్వయంగా ఒప్పుకున్నారు. 27 ఏళ్ల క్రితం తాను తీసిన సత్య సినిమా చూశానని, కన్నీళ్లు వచ్చాయని అన్నారు. ఈ క్రమంలో ఇక నుంచి మంచి సినిమాలే తీయాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గత కొంతకాలంగా తాను తీస్తున్న సినిమాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఆర్జీవీ.. ఇక నుంచి తన స్థాయికి తగ్గ సినిమాలు చేస్తానని తెలిపారు. అందులో భాగంగానే సిండికేట్ అనే సినిమాను చేయబోతున్నట్టు ప్రకటించారు వర్మ. ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్ అంటూ ఈ సినిమాకు ట్యాగ్ లైన్ పెట్టారు.

70వ దశకంలో భారత్ స్ట్రీట్ గ్యాంగ్స్‌తో మొదలుపెట్టి ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను చూసిందని.. ఐతే గత పది పదిహేనేళ్లుగా చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవని.. ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటాయో సిండికేట్ రూపంలో చూపించబోతున్నానని వర్మ ట్వీట్ చేశారు. ఈ భూమి మీద మనిషిని మించిన భయానక జంతువు మరొకటి లేదన్న సందేశంతోనే ఈ సిండికేట్ మూవీ మొదలవుతుందని కూడా చెప్పాడు. ఇదొక భయానక మూవీ అని వర్మ స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. అయితే పెద్ద స్టార్‌లతోనే ఈ సినిమా తీయాలని వర్మ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories