PNB Recruitment 2022: పంజాబ్ నేషనల్‌ బ్యాంకులో పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

PNB Recruitment 2022: శుభవార్త... పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి అదిరిపోయే నోటిఫికేషన్‌ విడుదలైంది.

Update: 2022-01-08 10:30 GMT

PNB Recruitment 2022: పంజాబ్ నేషనల్‌ బ్యాంకులో పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

PNB Recruitment 2022: బ్యాంకు జాబుల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి అదిరిపోయే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 10 జనవరి 2022. అభ్యర్థులు PNB అధికారిక వెబ్‌సైట్ pnbindia.in ను సందర్శిస్తే ఇతర వివరాలు తెలుస్తాయి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 6 పోస్టులు భర్తీ చేస్తారు.

1. చీఫ్ రిస్క్ ఆఫీసర్ పోస్టులు: అభ్యర్థి వృత్తిపరమైన రిస్క్ మేనేజ్‌మెంట్ సర్టిఫికేషన్, గ్రాడ్యుయేట్ డిగ్రీలతో 05 సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదంటే ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ది గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ ప్రొఫెషనల్స్ ఉండాలి.

2. చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ (చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్) - దరఖాస్తుదారులు ఏదైనా సబ్జెక్టులో విస్తృతమైన అనుభవం కలిగి ఉండాలి. కనీసం 15 సంవత్సరాలతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

3.CFO (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) - అభ్యర్థి తప్పనిసరిగా 15 సంవత్సరాల అనుభవంతో అర్హత కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి.

4. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ - దరఖాస్తుదారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా MCA లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. సంబంధిత రంగాలలో 15 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.

ఎలా దరఖాస్తు చేయాలి

అర్హతగల అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ www.pnbindia.in లో అందుబాటులో ఉన్న నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అభ్యర్థి రిజిస్టర్డ్/స్పీడ్ పోస్ట్ ద్వారా సీల్డ్ కవర్‌లో అవసరమైన అన్ని పత్రాలతో పాటు అప్లికేషన్ హార్డ్ కాపీని "ది జనరల్ మేనేజర్ - HRMD పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెచ్‌ఆర్ డివిజన్ 1వ అంతస్తు, వెస్ట్ వింగ్, కార్పొరేట్ ఆఫీస్ సెక్టార్ 10, ద్వారక"కు పంపాలి.

ఖాళీ వివరాలు

1. చీఫ్ రిస్క్ ఆఫీసర్ – 1 పోస్ట్

2. చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ – 1 పోస్ట్

3. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ – 1 పోస్ట్

4 చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ – 1 పోస్ట్

5. చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ – 1 పోస్ట్

6. చీఫ్ డిజిటల్ ఆఫీసర్ – 1 పోస్ట్

Tags:    

Similar News