భారత నావికాదళానికి కొత్త జెండా..

Indian Navy: భారత నావికాదళానికి సరికొత్త జెండాను ఆవిష్కరించారు ప్రధాని మోడీ.

Update: 2022-09-02 15:45 GMT

భారత నావికాదళానికి కొత్త జెండా.. 

Indian Navy: భారత నావికాదళానికి సరికొత్త జెండాను ఆవిష్కరించారు ప్రధాని మోడీ. బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న జెండా స్థానంలో భారత నౌకాదళ చిహ్నంతో కూడిన జెండాను రూపొందించారు. బ్రిటిష్ పాలనలోని నౌకాదళం జెండాలో కొనసాగుతున్న సెయింట్ జార్జిస్ క్రాస్ ను తొలగించి ఒక అష్టభుజి, దాని లోపల ముదురు నీలి రంగు మీద భారత నౌకాదళ చిహ్నాన్ని ముద్రించారు. తెల్ల జెండా మీద ఎడమవైపు చతుర్భాగంలో భారత జాతీయ జెండా ఉండగా, కుడి అర్థభాగంలో నీలిరంగు అష్టభుజి మధ్యలో భారత నౌకాదళ చిహ్నాన్ని ముద్రించారు. దీనికింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో నీలం రంగులో రాసి ఉంది. ఈ అష్టభుజికి జంట బోర్డర్లు, దాని మధ్యలోని నౌకాదళ చిహ్నం బంగారు రంగులో ఉన్నాయి. అష్టభుజాకారం చుట్టూ ఉన్న బంగారు వర్ణంలో ఉన్న బోర్డర్లను శివాజీ మహరాజ్‌ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారు. జెండాలో ఈ మార్పును వలస పాలన వాసనకు ఉద్వాసనగా ప్రధాని మోడీ అభివర్ణించారు.


Tags:    

Similar News