Narendra Modi: నేడు ఇటలీకి మోదీ.. జీ–7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని
దైపాక్షిక సంబంధాల బలోపేతంపై భేటీ కానున్న మోడీ
Narendra Modi: నేడు ఇటలీకి మోదీ.. జీ–7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని
ఇటలీలో జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోడీ గురువారం రోజున ఆ దేశానికి వెళ్తారన్నారు విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్. ఇటలీ ప్రధాని ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశానికి వెళ్లనున్నారని చెప్పారు. భారత్ ఇప్పటి వరకు 11 సమావేశాల్లో పాల్గొనగా... ప్రధాని మోడీ వరుసగా అయిదవ సమావేశంలో పాల్గొననున్నారని వెల్లడించారు. జీ7 సమావేశాల కోసం రానున్న దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశం అవుతారన్నారు. ఇటలీ ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భేటీ కానున్నారని చెప్పారాయన.