PM Modi: ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేందుకు ఇది ఒక ఉదాహరణ..
NITI Aayog: కో-ఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల సమిష్టి కృషి వల్ల కోవిడ్ మహమ్మారి నుంచి భారతదేశం బయటపడిందని అన్నారు ప్రధాని మోడీ.
PM Modi: ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేందుకు ఇది ఒక ఉదాహరణ..
NITI Aayog: కో-ఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల సమిష్టి కృషి వల్ల కోవిడ్ మహమ్మారి నుంచి భారతదేశం బయటపడిందని అన్నారు ప్రధాని మోడీ. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేందుకు ఇది ఒక ఉదాహరణగా ఉద్భవించిందన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో భారతదేశం యొక్క సమాఖ్య నిర్మాణం, సహకార సమాఖ్యవాదం ప్రపంచానికి ఒక నమూనాగా నిలిచిందన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఒక శక్తివంతమైన సందేశం పంపిందని మోడీ చెప్పారు.
జాతీయ ప్రాధాన్యతలను గుర్తించేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య నెలల తరబడి కఠోరమైన మేధోమథనం, సంప్రదింపులు జరిగాయని ప్రధాని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలలో మొదటిసారిగా, భారతదేశ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులందరూ ఒకే చోట సమావేశమై మూడు రోజుల పాటు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై చర్చించారన్నారు. ఈ సమిష్టి ప్రక్రియ ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా అభివృద్ధికి దారి తీసిందని మోడీ చెప్పారు.