PM Modi: ఆ ప్రధాని, అధ్యక్షులకు భారతీయ సంస్కృతి ఉట్టిపడే బహుమతులను ఇచ్చిన మోదీ
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర పోదీ కొన్ని రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్నసంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అక్కడ అధ్యక్షులు, ప్రధానిలకు మన దేశ సంస్కృతి ఉట్టిపడే బహుమతులను మోదీ అందజేశారు.
PM Modi: ఆ ప్రధాని, అధ్యక్షులకు భారతీయ సంస్కృతి ఉట్టిపడే బహుమతులను ఇచ్చిన మోదీ
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర పోదీ కొన్ని రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్నసంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అక్కడ అధ్యక్షులు, ప్రధానిలకు మన దేశ సంస్కృతి ఉట్టిపడే బహుమతులను మోదీ అందజేశారు. క్రొయేషియా అధ్యక్షుడికి ఒడిసా పట్ట చిత్రం, ప్రధానమంత్రికి రాజస్థాన్ వెండి కొవ్వొత్తి అలాగే సైప్రస్ అధ్యక్షునికి కాశ్మీరీ పట్టు తివాచీలను మోదీ బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతులు భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా క్రొయేషియాకు వెళ్లినప్పుడు ఆ దేశ ప్రధాని, అధ్యక్షులకు ఈ బహుమతులను అందజేసారు. క్రొయేషియాను సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. మొదటిసారి ఆ దేశానికి వెళ్లినందుకే భారతదేశ సంస్కృతి ఉట్టిపడే బహుమతులను అక్కడ నేతలకు అందజేశారు.
ఒడిసా పట్ట చిత్ర
క్రొయేషియా అద్యక్షుడు జోరాన్ మిలనోవిక్‌కు ఇచ్చిన ఒడిసా పట్ట చిత్ర చాలా ఫేమస్. దీని అర్ధం వస్త్ర చిత్రం. వస్త్రంపై భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని కళాకృతులను అల్లుతారు. శ్రీకృష్ణుడు, జగన్నాథ సంప్రదాయానికి సంబంధించిన కథలను ఈ బొమ్మలు తెలియజేస్తాయి. వస్త్రంపై రూపొందించిన ఈ బొమ్మల్లో కళాకారులు అన్నీ సహజ రంగులనే ఉపయోగించారు. అంతేకాదు ఈ బొమ్మలను వేయడానికి చేతితో తయారు చేసిన బ్రష్ లనే వాడతారు.
పట్టు తివాచీ
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్‌కు అందించిన కాశ్మీరీ పట్టు తివాచీ కూడా హ్యాండ్ మేడ్. ఎంతోమంది కళాకారులు ఈ తివాచీని చేతులతో తయారుచేసారు. దీనిపైన కశ్మీరీ కళ ఉట్టుపడుతుంది.
వెండి కొవ్వొత్తి స్టాండ్
క్రొయేషియా ప్రధాని ప్లెన్కోవిక్‌కు మోదీ వెండి కొవ్వొత్తుల స్టాండ్‌ను బహుకరించారు. ఇది రాజస్థానీ కళాఖండం. అక్కడి లోహ కళకు అందమైన ఉదాహరణ. పురాతన కాలం నాటి డిజైన్లు ఇందులో పొందుపరిచారు. వెండితో తయారుచేసిన ఈ కొవ్వొత్తుల స్టాండ్‌లో పూలు, ఆకుల డిజైన్లు రాజభవనాలు, దేవాలయాల నుండి తీసుకున్నవి. ఉదయ్ పూర్, జైపూర్ కళఖండాలు కూడా ఈ బహుమతిలో ఉన్నాయి.