Sunita Williams Returns: సునిత విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ.. అందులో ఏముందంటే..
PM Modi's letter to Sunita Williams: సునీత విలియమ్స్ మంగళవారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి రిటర్న్ జర్నీ...
Sunita Williams Returns: సునిత విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ
PM Modi's letter to Sunita Williams: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. వాస్తవానికి మార్చి 1నే మోదీ ఈ లేఖను రాశారు. కానీ తాజాగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆ లేఖను మీడియాతో పంచుకోవడంతో ఆ విషయం వెలుగులోకొచ్చింది.
సునీత విలియమ్స్ మంగళవారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి రిటర్న్ జర్నీ మొదలుపెట్టారు. ఆమె భూమిమీదకు వస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఇండియా పర్యటనకు రావాల్సిందిగా కోరుతూ మోదీ ఈ లేఖను రాశారు.
గతంలో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో మోదీ ఆయన్ను కలిశారు. అలాగే ఇటీవల అమెరికా వెళ్లి వైట్ హౌజ్‌లో డోనాల్డ్ ట్రంప్‌తోనూ భేటీ అయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ సునీత విలియమ్స్ యోగక్షేమాల గురించి వారిని ఆరాతీసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. సునీత తన అంతరిక్ష ప్రయోగాన్ని పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
2024 జూన్ లో సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం అక్కడ వారు వారం రోజులే ఉండాల్సి ఉంది. కానీ వారు వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది ఖాళీగా భూమిమీదకు తిరిగొచ్చింది. వారు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు.
గతేడాది డిసెంబర్‌లో ఒకసారి, ఈ ఏడాది జనవరి చివర్లో మరోసారి ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ఎక్స్ ప్రయత్నించాయి. కానీ పలు సాంకేతిక సమస్యలతో ఆ ప్రయత్నాల్లో ముందడుగు పడలేదు. ఎట్టకేలకు 9 నెలల తరువాత ఇప్పుడు సునిత విలియన్స్, బుచ్ విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమ్మీదకు తిరిగొస్తున్నారు.