PM Modi: ఆదమ్‌పుర్ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ
PM Modi Visits Adampur Airbase: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదమ్‌పుర్ ఎయిర్‌బేస్ (Adampur Air Base)ను సందర్శించారు.
PM Modi: ఆదమ్‌పుర్ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ
PM Modi Visits Adampur Airbase: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్‌లోని ఆదమ్‌పుర్ ఎయిర్‌బేస్ (Adampur Air Base)ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న భారత వైమానిక దళ సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం, అలాగే భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్శనలో సరిహద్దు భద్రతా పరిస్థితులు, సైనికుల సంక్షేమం, ప్రాంతీయ స్థితిగతులపై మోదీ సమీక్షించినట్లు సమాచారం. రాష్ట్ర భద్రతా విభాగాధికారులు, వైమానిక దళ ఉన్నతాధికారులు ప్రధానితో సమావేశమై వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.