PM Modi: వరస పర్యటనలతో ప్రధాని బిజీబిజీ.. నేడు తమిళనాడుకు మోడీ
PM Modi: రెండు రోజులపాటు తమిళనాడు, లక్షద్వీప్‌లో ప్రధాని పర్యటన
PM Modi: వరస పర్యటనలతో ప్రధాని బిజీబిజీ.. నేడు తమిళనాడుకు మోడీ
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనతో నూతన సంవత్సరానికి శ్రీకారం చుట్టనున్నారు. మోడీ రెండు రోజులపాటు తమిళనాడు, లక్షద్వీప్‌లో పర్యటించనున్నారు. నేడు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో భారతీదాసన్ వర్సిటీ స్నాతకోత్సవానికి చీఫ్ గెస్టుగా మోడీ హాజరుకానున్నారు. అనంతరం తిరుచిరాపల్లిలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ విమానయానం, రైలు, రోడ్డు, చమురు, గ్యాస్, షిప్పింగ్, ఉన్నత విద్యా రంగాలకు సంబంధించి కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు.
ఇక మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అక్కడ కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రేపు కేరళలోని రెండు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు.