PM Modi: ప్రభుత్వాల కూల్చివేతపై కాంగ్రెస్‌కు మోడీ కౌంటర్.. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే..
Narendra Modi: ప్రభుత్వాల కూల్చివేతపై రాజ్యసభలో దుమారం చెలరేగింది.
PM Modi: ప్రభుత్వాల కూల్చివేతపై కాంగ్రెస్‌కు మోడీ కౌంటర్.. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే..
Narendra Modi: ప్రభుత్వాల కూల్చివేతపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. కూల్చివేతల సర్కార్ మీదంటే మీదంటూ కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై మరొకరు తిట్లపురాణం అందుకున్నారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ శివాలెత్తారు. ఆరు దశాబ్ధాలకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సర్కార్ తీరు చూస్తే బాధ, కోపం వస్తుందన్నారు.
దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసిందన్న మోడీ...దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన ఘనచరిత్ర ఆపార్టీకి ఉందన్నారు. తమిళనాడులో ఎంజీఆర్ వంటి దగ్గజ ప్రభుత్వాలను కూడా కాంగ్రెస్ కూకటివేళ్లతో పెకిలించి వేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు..ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్తే..ఆ వెంటనే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. అలాంటి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ..బీజేపీని అనడం ఎంతవరకు సమంజసం అని మోడీ ప్రశ్నించారు.