PM Modi: డ్రామాలొద్దు.. విపక్షాలు ఓటమిని దాటి ప్రవర్తించాలి
PM Modi: వికసిత్ భారత్ దిశగా దేశం ముందడుగు వేస్తుందని ప్రదాని మోడీ అన్నారు.
PM Modi: డ్రామాలొద్దు.. విపక్షాలు ఓటమిని దాటి ప్రవర్తించాలి
PM Modi: వికసిత్ భారత్ దిశగా దేశం ముందడుగు వేస్తుందని ప్రదాని మోడీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. చట్టసభల్లో చర్చలు తప్పని సరి అన్నారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో అధికార విపక్ష సభ్యుల సాక్షిగా మంచి చర్చలు కొనసాగాలాని సూచించారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సభా సమయాల్లో డ్రామాలు వద్దని, చట్టసభల్లో చర్చలు తప్పనిసరని హితవు పలికారు.