PM Modi: ముగిసిన అమెరికా, ఈజిప్టు పర్యటన, స్వదేశానికి తిరిగివచ్చిన మోదీ
PM Modi: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికిన బీజేపీ నేతలు
PM Modi: ముగిసిన అమెరికా, ఈజిప్టు పర్యటన, స్వదేశానికి తిరిగివచ్చిన మోదీ
PM Modi: రు రోజులపాటు అమెరికా,ఈజిప్ట్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధానికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వాగతం పలికారు. ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా అమెరికా, ఈజిప్ట్‌లో చారిత్రక ఒప్పందాలు చేసుకున్నారు. ఈనెల 20న అమెరికా పర్యటన వెళ్లిన ప్రధాని మోడీ.. ఈ నెల 21వ తేదీన ఐరాసలో ప్రపంచ యోగా దినోత్సవం పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చలు జరిపిన ప్రధాని.. రక్షణ, అంతరిక్ష, వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అమెరికా కాంగ్రెస్‌లో చారిత్రాత్మక ప్రసంగం చేశారు మోడీ. అమెరికా నుంచి ఈజిప్ట్ పర్యటనకు తొలిసారి వెళ్లారు. ఆర్డర్ ఆఫ్ ద నైల్ పురస్కారంతో మోడీని ఈజిప్ట్ అధ్యక్షుడు సత్కరించారు.