PM Modi: మధ్యవర్తిత్వాన్ని భారతదేశం ఎప్పుడూ కోరలేదు.. ట్రంప్‌తో ఫోన్ ద్వారా స్పష్టం చేసిన మోదీ

PM Modi: ఆపరేషన్ సింధూర్ అనేది పాక్ టెర్రరిస్టులు జరిపిన దాడి ప్రతిదాడి అని, ఆ తర్వాత సరిహద్దు పాక్ కవ్వింపు చర్యలు చేస్తుంటే మరికొన్ని దాడులు చేయాల్సి వచ్చిందని మోదీ వివరించారు

Update: 2025-06-18 05:10 GMT

PM Modi: మధ్యవర్తిత్వాన్ని భారతదేశం ఎప్పుడూ కోరలేదు.. ట్రంప్‌తో ఫోన్ ద్వారా స్పష్టం చేసిన మోదీ

PM Modi: జమ్ముకశ్మీర్‌‌లోని కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ ఆక్రమంగా ఆక్రమించుకున్న సమస్యను పరిష్కరించుకోడానికి భారత దేశం ఎప్పుడూ థర్డ్ పార్టీ మీడియేషన్‌ను కోరలేదని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తేల్చి చెప్పారు. జమ్ముకశ్మీర్ విషయంలో ఇప్పటివరకు ఎవరి మధ్యవర్తిత్వాన్ని మేము అంగీకరించలేదని ఎప్పటికీ అంగీకరించమని కూడా మోదీ స్పష్టం చేసినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు.

ఇటీవల ఫోన్‌లో ట్రంప్‌, నరేంద్ర మోదీ ఇద్దరూ ఆపరేషన్ సింధూర్‌‌పై మాట్లాడిన సమయంలో జమ్ముకశ్మీర్ విషయం వచ్చిన సందర్భంలో.. థర్డ్ పార్టీ మీడియేషన్‌ని ఎవరినీ అంగీకరించలేదని, ఎప్పటికీ అంగీకరించమని మోదీ ట్రంప్‌తో అన్నట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.

ఆపరేషన్ సింధూర్ అనేది పాక్ టెర్రరిస్టులు జరిపిన దాడి ప్రతిదాడి అని, ఆ తర్వాత సరిహద్దు పాక్ కవ్వింపు చర్యలు చేస్తుంటే మరికొన్ని దాడులు చేయాల్సి వచ్చిందని మోదీ వివరించారు. అంతేకాదు ఈ దాడులన్నీ కూడా పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్‌‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని జరిపినట్లు కూడా మోదీ ట్రంప్‌కు చెప్పారు. మీడియేషన్ విషయం వచ్చినప్పుడు కశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తత్వాన్ని తాము కోరమని మెదీ నొక్కి చెప్పారు.

ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌పై భారత్ కాల్పులు జరిపిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ సమయంలో పలు నేతలు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చారు. అయినా భారత్ ఆ మాటలు వినలేదు. పాక్‌పై దాడులు చేసింది. అయితే ఆ తర్వాత భారత్ దాడి ముగించిన తర్వాత ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణపై చర్చలు జరిపి, కాల్పులు విరమించేలా చేసినట్లు ట్రంప్ పదే పదే క్రెడిట్‌ను సంపాదించుకోవాలని చూశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మోదీ ట్రంప్ మధ్యవర్తిత్వం విషయంలో ఇలా గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News