PM Modi: స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రధాని రక్షా బంధన్ వేడుక
PM Modi: విద్యార్థినులతో సరదాగా ముచ్చటించిన ప్రధాని మోడీ
PM Modi: స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రధాని రక్షా బంధన్ వేడుక
PM Modi: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని మోడీ వేడుకల్లో పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థినులతో కలిసి ప్రధాని రక్షా బంధన్ వేడుకను చేసుకున్నారు. ఢిల్లీ పాఠశాలల విద్యార్థులు బుధవారం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులతో ఆయన సరదాగా ముచ్చటించారు. చిన్నారులను పలకరిస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అంతకుముందు, రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు.