PM Modi: వందేమాతరం గేయం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చింది

PM Modi: జాతీయ గీతం 'వందేమాతరం' 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

Update: 2025-12-08 07:21 GMT

PM Modi: వందేమాతరం గేయం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చింది

PM Modi: జాతీయ గీతం 'వందేమాతరం' 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వందేమాతరం గీతం దేశ స్వాతంత్ర్యోద్యమంలో పోషించిన పాత్రను, అది భారతీయ సమాజానికి అందించిన స్ఫూర్తిని ఆయన కొనియాడారు.

ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

"వందేమాతరం గీతం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చింది. ఈ చారిత్రక సందర్భంలో లోక్‌సభలో ఈ గీతంపై చర్చ జరగడం భారతీయులందరి అదృష్టం. ఈనాటి చర్చ భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది."

"వందేమాతరం గీతం దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చే శక్తిని ఇచ్చింది. ఈ గీతంతో దేశం మొత్తం ఏకమైంది."

 "వందేమాతరం గీతానికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దేశ చరిత్రలో ఈ గీతం స్థానం అజరామరం."

వందేమాతరం గీతానికి సంబంధించిన కీలక చారిత్రక ఘట్టాలను ప్రధాని గుర్తు చేశారు. వందేమాతరం గీతం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు, దేశం వలస పాలనలో ఉందని మోదీ ప్రస్తావించారు. వందవ వార్షికోత్సవం సందర్భంగా.. దేశంలో అత్యవసర పరిస్థితి (Emergency) అమలులో ఉందని, అప్పుడు కూడా ఈ గీతం దేశ ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక చర్చలో పాల్గొన్నందుకు తాను గర్వపడుతున్నానని ప్రధాని మోదీ తెలిపారు.

Tags:    

Similar News