PM Modi Somnath temple: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ప్రభాస్ పటాన్ వద్ద ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మొదటి శివాలయాన్ని మోదీ సందర్శించి ప్రార్థనలు చేశారు.
అంతకుముందు, ప్రధానమంత్రి మోదీ జామ్‌నగర్ జిల్లాలోని జంతు రక్షణ, సంరక్షణ, పునరావాస కేంద్రమైన వంతారాను సందర్శించారు. ఆలయాన్ని సందర్శించిన తర్వాత, మోదీ పొరుగున ఉన్న జునాగఢ్ జిల్లాలో ఉన్న ఆసియా సింహాలకు ఏకైక నివాస స్థలం అయిన గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయమైన సాసన్‌కు బయలుదేరారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ముగిసిన తర్వాత సోమనాథుడిని పూజించాలనే తన సంకల్పంలో భాగంగా ఈ సందర్శన జరిగిందని 'X' పై ఒక పోస్ట్‌లో మోదీ అన్నారు. “కోట్లాది మంది దేశవాసుల కృషితో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన 'ఐక్యత మహాకుంభ్' సాధించబడింది. ఒక భక్తుడిగా, మహా కుంభమేళా తర్వాత, 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన శ్రీ సోమనాథుడిని పూజించాలని నా మనస్సులో నిశ్చయించుకున్నాను.
ఈ రోజు, సోమనాథ్ దాదా ఆశీర్వాదంతో, ఆ సంకల్పం నెరవేరింది. దేశ ప్రజలందరి తరపున, నేను శ్రీ సోమనాథ్ భగవాన్ పాదాల వద్ద ఐక్యత మహా కుంభ్ విజయాన్ని అంకితం చేస్తున్నాను. అలాగే, వారి (దేశవాసుల) ఆరోగ్యం శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను" అని ప్రధానమంత్రి మోదీ సందేశంలో రాశారు.
సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత, ప్రధాని మోదీ పొరుగున ఉన్న జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయం సాసన్‌కు బయలుదేరారు.
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ససాన్‌లో 'లయన్ సఫారీ'కి ప్రధానమంత్రి వెళతారు. జాతీయ వన్యప్రాణి బోర్డు (NBWL) సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.