PM Modi: ఒకరోజు పర్యటన కోసం గ్రీస్‌ చేరుకున్న భారత ప్రధాని.. ఏథెన్స్‌ విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం

PM Modi: 40ఏళ్ళ తర్వాత గ్రీస్‌లో పర్యటించిన భారత ప్రధాని

Update: 2023-08-25 06:56 GMT

PM Modi: ఒకరోజు పర్యటన కోసం గ్రీస్‌ చేరుకున్న భారత ప్రధాని.. ఏథెన్స్‌ విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం

PM Modi: భారత ప్రధాని నరేంద్ర ఒకరోజు పర్యటన కోసం గ్రీస్‌ చేరుకున్నారు. 15వ బ్రిక్స్‌ సమ్మిట్‌ ముగిసిన తర్వాత మోడీ దక్షిణాఫ్రికా నుంచి బయల్దేరి గ్రీస్‌ చేరుకున్నారు. ఏథెన్స్‌ విమానాశ్రయంలో మోడీకి గ్రీస్‌ ప్రధాని ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై గ్రీస్‌ ప్రధానితో మోడీ చర్చించారు. ఏథెన్స్‌ చేరుకున్న ప్రధాని మోడీకి భారత సంతతికి చెందిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. మోడీ.. మోడీ నినాదాలతో ఏథెన్స్‌ నగర వీధులు మారు మోగాయి. మోడీని చూసేందుకు భారతీయులు ఆసక్తిగా కొన్ని గంటల పాటు ఎదురు చూశారు. 40ఏళ్ళ తర్వాత గ్రీస్‌లో పర్యటించిన భారత ప్రధాని మోడీ కావడం విశేషం.

Tags:    

Similar News