PM Modi: విశ్వకర్మపథకం కులవృత్తులకు ఆశాకిరణం
PM Modi: హ్యాండ్ స్కిల్స్, టూల్స్‌తో పనిచేస్తున్న కుటుంబాలకు.. ఈ పథకం ఆశాకిరణంగా నిలుస్తుంది
PM Modi: విశ్వకర్మపథకం కులవృత్తులకు ఆశాకిరణం
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో ద్వారకలోని ఐఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ.. విశ్వకర్మ పథకం కుల వృత్తుల వారికి ఒక కొత్త ఆశాకిరణమని పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతిని.. భారత సాంప్రదాయ కళాకారులు, నిపుణులకు అంకితం చేశామని..ప్రధాని మోడీ తెలిపారు. హ్యాండ్ స్కిల్స్, టూల్స్‌తో పనిచేస్తున్న లక్షలాది కుటుంబాలకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కొత్త ఆశాకిరణంగా నిలుస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.