National Herald Case: సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

National Herald Case: చాలా కాలంగా సంచలనం సృష్టిస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2025-12-22 09:01 GMT

National Herald Case: సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

National Herald Case: చాలా కాలంగా సంచలనం సృష్టిస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు, సోనియా, రాహుల్‌లతో పాటు ఇతర నిందితులకు సోమవారం నోటీసులు జారీ చేసింది.

గతంలో ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా ఈడీ ఒక ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అయితే, దీనిని విచారించిన ట్రయల్ కోర్టు.. సరైన ఆధారాలు లేవనే కారణంతో ఆ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈడీ అధికారులు తీవ్రంగా పరిగణించి, ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు.

ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సమీక్షించాల్సి ఉందని భావించింది. ఈ క్రమంలోనే తమ వాదనలను వినడానికి సోనియా, రాహుల్‌లకు నోటీసులు పంపింది. తదుపరి విచారణలో వారు తమ వివరణను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.

నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏమిటి?

నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తులను 'యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ ద్వారా స్వాధీనం చేసుకోవడంలో భారీగా అక్రమ నగదు లావాదేవీలు (Money Laundering) జరిగాయన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఇందులో గాంధీ కుటుంబానికి కీలక వాటాలు ఉన్నాయని ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Tags:    

Similar News